విరూపాక్ష సినిమా.. ప్రభాస్ సినిమా పైన ఎఫెక్ట్ పడుతుందా..!!
అయితే రీసెంట్ గా సాయి ధరంతేజ్ నటించిన విరూపాక్ష సినిమాతో సీరియస్ హర్రర్ మూవీని చేశారు. ఈ సినిమా కథ కథనాలు కన్నా మ్యూజిక్ సినిమా ఆటోగ్రఫీ చాలా హైలైట్ గా నిలుస్తోంది. విరూపాక్ష కు పెరు రాకపోతే ఏమో కానీ ఇప్పుడు హర్రర్ సినిమా అంటే విరుపాక్ష అనేలా కనిపిస్తోంది.మరి ఈ సమయంలో ప్రభాస్ తో డైరెక్టర్ మారుతి చేస్తున్న సినిమా అంతకుమించి అనేలా ఉండాల్సిందే లేకపోతే చిక్కుల్లో పడక తప్పదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా మారుతి మీద ఎక్కువగా ప్రెజర్ అయ్యేలా చేస్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు
మారుతి కూడా తప్పకుండా వీరుపాక్ష సినిమా చూసిన తర్వాత ప్రభాస్ సినిమాలోని కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మారుతి చెప్పిన కథ నమ్మి ప్రభాస్ ఈ సినిమా ఓకే చేశారని హర్రర్ కామెడీ అంటూ తనకు బాగా నచ్చిన జోనర్ లో సినిమాను చేస్తున్నాడని తెలుస్తోంది. కానీ విరూపాక్ష సినిమా విడుదలై ఒకసారిగా షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ సినిమా ఏ మాత్రం తేడా కొట్టిన విరూపాక్ష సినిమాతో పోల్చి మరి ఆ సినిమాని ట్రోల్ చేయడం జరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు. విరూపాక్షి సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా డైరెక్టర్ మారుతి పాల్గొనడం జరిగింది. ఈ సినిమా చూశాను తనకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ గా అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత ప్రభాస్ సినిమాలో తగు జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపారు మారుతి.