"రామబాణం" మూవీ ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
టాలీవుడ్ మాస్ హీరోల్లో ఒకరు అయినటు వంటి గోపీచంద్ ఆఖరుగా పక్కా కమర్షియల్ అనే మూవీ లో హీరో గా నటించి ప్రేక్షకులను నిరాశపరచాడు. ఈ మూవీ కి మారుతీ దర్శకత్వం వహించగా ... యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఈ మూవీ లో రాశి కన్నా ... గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇలా పక్కా కమర్షియల్ మూవీ తో ప్రేక్షకులను నిరాశపరిచిన గోపీచంద్ తాజాగా రామబాణం అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.
 


ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ కి శ్రీ వాసు దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో గోపీచంద్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు ... కుష్బూ ఈ మూవీ.లో కీలక పాత్రలలో నటించగా ... మిక్కి జై మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్రం బృందం కొన్ని పాటలను మరియు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.


 ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఓవర్ సిస్ హక్కులను ఒక ప్రముఖ సంస్థ కు అమ్మి వేసింది. ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను రెడ్ హార్ట్ మూవీస్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఓవర్ సీస్ ఈ సంస్థ భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను దక్కించుకున్నట్లు తాజాగా ఈ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరి రామబాణం మూవీ తో గోపీచంద్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: