బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సల్మాన్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి వాటితో ఎన్నో విజయాలను అందుకొని ఇండియాతో పాటు అనేక దేశాల్లో ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న సల్మాన్ ఈ మధ్య కాలంలో భారీ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేదు.
ఇది ఇలా ఉంటే తాజాగా సల్మాన్ "కిసీ కా భాయ్ కిసీ కి జాన్" అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ తమిళంలో సూపర్ హిట్ విజయం అందుకున్నటువంటి వీరమ్ అనే మూవీ కి రీమేక్ గా రూపొందినట్లు తెలుస్తోంది. వీరమ్ మూవీ తెలుగు లో కాటమరాయుడు పేరుతో రీమేక్ అయ్యి పర్వాలేదు అనే రేంజ్ విజయం అందుకుంది.
ఇది ఇలా ఉంటే "కిసీ కా భాయ్ కిసీ కి జాన్" మూవీ లో సల్మాన్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా ... విక్టరీ వెంకటేష్ ... భూమిక చావ్లా ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. జగపతి బాబు ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి అంచనాలు నడుమ ఏప్రిల్ 21 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. కాకపోతే ఈ సినిమాకి భారీ కలెక్షన్ బాక్స్ ఆఫీస్ దగ్గర లభించడం లేదు. ఈ మూవీ ఇప్పటి వరకు రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మొదటి రోజు 15.8 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ ... రెండో రోజు 25.75 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. దీనితో రెండు రోజుల్లోనే ఈ మూవీ 41.56 కోట్లు వసూలు చేసింది. ఇలా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ లో కలెక్షన్ లను కనబడుతుంది.