"రామబాణం" మూవీ నుండి "నువ్వే నువ్వే" సాంగ్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న మాస్ హీరోలలో ఒకరు అయినటు వంటి గోపిచంద్ తాజాగా రామబాణం అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శ్రీ వాసు దర్శకత్వం వహించాడు. ఇది వరకే గోపీచంద్ ... శ్రీ వాసు కాంబినేషన్ లో లక్ష్యం ... లౌక్యం అనే రెండు బ్లాక్ బస్టర్ మూవీ లు రూపొందాయి. దానితో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ లో మోస్ట్ గార్జియస్ నటి మనులలో ఒకరు అయినటు వంటి డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... జగపతి బాబు ... కుష్బూ ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు.


మిక్కీ జై మేయర్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి ఈ మూవీ బృందం ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి మూడవ పాట విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ నుండి నువ్వే నువ్వే అనే సాంగ్ ను ఏప్రిల్ 24 వ తేదీన విడుదల చేనునట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.


ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మే 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఇప్పటి వరకు అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. మరి రామబాణం మూవీ తో గోపీచంద్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో తెలియాలి అంటే మే 5 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: