మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చాలా కాలం తర్వాత విరూపాక్ష సినిమాతోబిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా డైరెక్టర్ కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ఎంతగానో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.సినిమాలో ప్రతి సీన్ కూడా ఊహించని ట్విస్ట్‌లో స్టోరీ సాగిపోతుండడంతో ఆడియన్స్ ఈ సినిమాని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఉదయం ఫస్ట్ షో నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈ మూవీ సాయంత్రానికి మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఇందులో తేజ్ నటన.. కార్తీక్ దండు టేకింగ్ సినీ ప్రియులను ఎంతగానో కట్టిపడేశాయి. దీంతో ఈ మూవీని చూసేందుకు ఆడియన్స్ బ్రహ్మారథం పట్టారు. ఈ క్రమంలోనే విరూపాక్ష చిత్రయూనిట్ ప్రేక్షకులకు స్పెషల్ రిక్వెస్ట్స్ చేస్తుండడం జరిగింది. ఈ మూవీలో చాలా త్రిల్లింగ్ ట్విస్టులు ఉంటాయని.. వాటిని ముందుగానే లీక్ చేయవద్దని మూవీ టీం వారు కోరారు.'ఈ మూవీలో ఉన్న కీలక అంశాలు ఇంకా ట్విస్టులను దయచేసి ఎక్కడా లీక్ చేయకండి.
వెండితెరపై చూసి ఓ అద్భుతమైన అనుభవాన్ని మీరు పొందండి' అంటూ టీం పేర్కొంది. రుద్రవనం అనే ఊరి చుట్టూ సాగే కథతో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ఎన్నో ట్విస్టులు ఇంకా భయాన్ని కలిగించే సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమా హిట్ కావడంతో తేజ్ చాలా సంతోషంగా ఉన్నారు. బైక్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత సాయి తేజ్ నటించిన మొదటి చిత్రమిదే. దీంతో ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల స్పందన చూసి సాయి తేజ్ ఎంతగానో ఎమోషనల్ అయ్యారు.ఈ మూవీలో తేజ్ సరసన సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది. ఇప్పటి దాకా హోమ్లీగా కనిపించిన ఈ బ్యూటీ.. ఈ మూవీలో మాత్రం కాస్త గ్లామర్ డోస్ పెంచినట్లుగా చూస్తుంటే తెలుస్తోంది. అయితే మొదటి నుంచి వరుస హిట్స్ అందుకుంటున్న సంయుక్త మీనన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడింది. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు రావడం మాత్రం ఖాయమని సమాచారం తెలుస్తోంది.