తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి
విజయ్ తాజాగా వారిసు అనే
తమిళ మూవీ లో
హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ మంచి విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వం లో రూపొందిన ఈ
మూవీ తెలుగు లో వారసుడు అనే పేరుతో విడుదల అయింది. ఈ
మూవీ టాలీవుడ్
బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
విజయ్ ...
లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపాందుతున్న లియో అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు .
ఈ సంవత్సరం
అక్టోబర్ 19 వ తేదీన ఈ
మూవీ ని
థియేటర్ లలో విడుదల చేయనున్నారు .
త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ
మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు . ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమాకు సంబంధించిన మొత్తం షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే
విజయ్ ...
లోకేష్ ... అనిరుద్ కాంబినేషన్ లో రూపొందిన
మాస్టర్ మూవీ ఆల్బమ్ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ
మూవీ ఆల్బమ్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ
మూవీ ఆల్బమ్ ను కూడా అదే స్థాయిలో చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ
మూవీ యొక్క
ఆడియో వేడుకను
తమిళ నాడు లోని ఒక భారీ పట్టణంలో భారీ ఎత్తున నిర్వహించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.