"ఉగ్రం" ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వేదిక ఖరారు..!

Pulgam Srinivas
అల్లరి నరేష్ ఆఖరుగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే వైవిధ్యమైన మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాలు నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లోని నరేష్ నటన కు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే తాజాగా నరేష్ "ఉగ్రం" అనే మూవీ లో హీరో గా నటించాడు. విజయ్ కనకమెడల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నరేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను మే 5 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
 


ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను ఏప్రిల్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సంబంధించిన మరో అప్డేట్ ను ఇచ్చింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఖమ్మం లోని లేక్ వ్యూ క్లబ్ ... సీక్వెల్ లో ఏప్రిల్ 21 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది.


ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి ఇప్పటి వరకు చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం ... ఈ మూవీ లో నరేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తూ ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: