మాస్ కా దాస్
విశ్వక్ సేన్ తాజాగా దాస్ కా దమ్కి అనే
మూవీ లో
హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో విశ్వక్
హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ
మూవీ కి దర్శకత్వం కూడా చేశాడు. ఈ సినిమాలో
రావు రమేష్ ...
ఆది ముఖ్య పాత్రల్లో నటించగా ...
నివేత పేతురాజు ఈ సినిమాలో విశ్వక్ సరసన
హీరోయిన్ గా నటించింది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో పాగల్
మూవీ రూపొందింది. ఇది వీరి కాంబినేషన్ లో రెండవ సినిమా.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి
బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకుంది. ఇలా
బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకున్న ఈ
సినిమా కొన్ని రోజుల నుండి ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటు వంటి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ
మూవీ కి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే ఈ
సినిమా ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో 100 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ ను అందుకుంది. ఈ విషయాన్ని ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ అధికారికంగా ప్రకటించింది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విశ్వక్ "దాస్ కా దమ్కి పార్ట్ 2"
మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. విశ్వక్ తాజాగా దాస్ కా ధమ్కీ పార్ట్ 1 కంటే పార్ట్ 2 పది రేట్లు అద్భుతంగా ఉంటుందని అన్నారు. స్టోరీ ని ఆ విధంగా సిద్ధం చేశామని ... తప్పకుండా ప్రేక్షకులు ఆ సినిమాతో మరింత ఎక్కువగా థ్రిల్ అవుతారని విశ్వక్ అన్నారు.