"కంగువా" మూవీ డిజిటల్ హక్కులను ఏకంగా అన్ని కోట్లకు దక్కించుకున్న అమెజాన్ సంస్థ..?

Pulgam Srinivas
ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో భారీ అంచనాలతో ... అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా "కంగువా". ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నాడు . ఇది వరకు శివ తమిళ ఇండస్ట్రీ లో దర్శకత్వం వహించిన సినిమా లలో చాలా సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించడంతో ఈ సినిమా పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు .


ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ దర్శకుడు రవితేజ హీరోగా తాప్సి హీరోయిన్ గా రూపొందినటువంటి దరువు అనే తెలుగు సినిమాకు దర్శకత్వం వహించాడు . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది . ఆ తర్వాత ఈ దర్శకుడు ఇప్పటి వరకు తెలుగు లో ఏ మూవీ కి దర్శకత్వం వహించలేదు. ఇది ఇలా ఉంటే శివ దర్శకత్వం లో రూపొందుతున్న "కంగువా" మూవీ లో సూర్యా హీరో గా నటిస్తున్నాడు . 


ఈ మూవీ ని 10 భాషలలో విడుదల చేయనున్నారు . ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు . ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే ఈ మూవీ కి సంబంధించిన డిజిటల్ హక్కులు అమ్ము డుపోయినట్లు తెలుస్తోంది . ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ 100 కోట్ల ధరకు అన్ని భాషల యొక్క హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో దిశా పటాని ... సూర్య సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: