ఆ స్టార్ హీరో సినిమాలో నటించబోతున్న నాని...!!
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. సినిమాల్లో నాని నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాకుండా దసరా సినిమా విడుదలైన మొదటి రోజే కోట్లలో కలెక్షన్స్ ను సాధించి నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా అయితే నిలిచింది. ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు 110 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసిందనీ తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రసారం అవుతోంది.
ఇది ఇలా ఉంటే నాని ప్రస్తుతం తన తదుపరి సినిమాలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నాని హీరోగా నటిస్తుండగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలుకాగ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ ని కూడా ప్రకటించారు. ఈ ఏడాది అనగా డిసెంబర్ 21వ తేదీన క్రిస్మస్ పండుగ కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించారట.దీంతో ఈ సినిమాను శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారనీ తెలుస్తుంది.. నాని ఈ సినిమాతో పాటు మరో సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించబోతున్నారనీ తెలుస్తుంది.. సంతోషించాల్సిన సంగతి ఆ రెండు సినిమాలు కూడా ఒకే ఏడాది ఒకేసారి విడుదల కానున్నాయి. కానీ ఒకసారి హీరో సినిమాలో నటిస్తున్నారట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు విక్టరీ వెంకటేష్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైంధవ్ సినిమాలో నాని ముఖ్య పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగు కూడా శరవేగంగా జరుగుతోందనీ తెలుస్తుంది.. ఈ ఏడాది డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రం బృందం అధికారికంగా అయితే ప్రకటించారు. కేవలం ఒక్కరోజు తేడాతో నాని నటిస్తున్న రెండు సినిమాలు కూడా విడుదల కానున్నాయనీ తెలుస్తుంది.