ఇక ఈ
సినిమా చూసిన సామాన్యులే కాదు.. సినీ ప్రముఖులు కూడా చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే
సూపర్ స్టార్ మహేష్,
రెబల్ స్టార్ ప్రభాస్ లాంటి బిగ్ హీరోస్
దసరా చిత్రయూనిట్ పై పొగడ్తల వర్షం కురిపించగా.. తాజాగా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆసక్తికర ట్వీట్ చేశారు.దసరా చిత్రయూనిట్ మొత్తాన్ని కూడా ఎంతగానో అభినందించారు బన్నీ.ఇక థియేటర్లలో
సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యి
నాని కెరీర్ లో బిగ్గెస్ట్
బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ
సినిమా ఇక త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన
అమెజాన్ ప్రైమ్ లో ఈ
సినిమా స్ట్రిమింగ్ కానున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన అనేది రానుంది.మొత్తానికి
నాని ఆశించిన విజయాన్ని అందించింది ఈ
దసరా సినిమా.