ఈరోజు ఆ సమయానికి "విరూపాక్ష" మూవీ నుండి "కళ్ళల్లో" సాంగ్ విడుదల..!

Pulgam Srinivas
సాయి ధరమ్ తేజ్ తాజాగా విరూపాక్ష అనే సస్పెన్స్ థ్రిల్లర్ హార్రర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించగా ... కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడుగా తన కెరియర్ ను ప్రారంభించ బోతున్నాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తోంది.


అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించింది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వరుస ఇంటర్వ్యూ లలో  పాల్గొంటూ ... టీవీ షో లలో పాల్గొంటూ ఈ సినిమాను అదిరిపోయే రేంజ్ లో ప్రమోట్ చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను ప్రకటించింది.


ఈ మూవీ యూనిట్ ఈ మూవీ లోని "కళ్ళల్లో" అనే సాంగ్ విడుదల తేదీని తాజాగా ప్రకటించింది. ఈ మూవీ లోని "కళ్ళల్లో" అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 04 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్.లో సాయి తేజ్ మరియు సంయుక్త మీనన్ లు ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: