తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరో లలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. పిల్ల నువ్వు లేని జీవితం అనే మూవీ తో మంచి విజయాన్ని అందుకొని మంచు గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సాయి తేజ్ దక్కించుకున్నాడు. ఈ మూవీ లో రెజీనా క్యాసాండ్రా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తర్వాత సుప్రీమ్ ... సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ... ప్రతి రోజు పండగే ... సోలో బ్రతికే సో బెటర్ ... రిపబ్లిక్ వంటి విజయవంతమైన మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సాయి తేజ్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో విరూపాక్ష అనే మూవీ లో హీరో గా నటించాడు. కార్తీ దండు అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ మూవీ లో యంగ్ బ్యూటీ సంయుక్తా మీనన్ సాయి తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.
ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు చాలా అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుని పెద్ద విజయం సాధిస్తుందో లేదో చూడాలి. రిపబ్లిక్ లాంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత సాయి తేజ్ నటించిన మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.