హైదరాబాద్లో బాలకృష్ణపై యాక్షన్స్ సన్నివేశాలు..!

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించిన కాజల్ అగర్వాల్ ... బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... యంగ్ బ్యూటీ శ్రీ లీల ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతుంది.


 దానితో ఈ మూవీ షూటింగ్ ను ప్రస్తుతం ఈ మూవీ బృందం ఎన్ బి కె 108 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం కూడా ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ ను తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ లో బాలకృష్ణ కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం బాలకృష్ణ పై భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.


అనిల్ రావిపూడి ఈ మూవీ లోని యాక్షన్ సన్నివేశాలను చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లోని యాక్షన్స్ సన్ని వేషాలు కూడా అద్భుతంగా వస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ లో బాలకృష్ణ తెలంగాణ మాండలికంలో మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది. వరుస విజయాల తర్వాత బాలకృష్ణ నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై బాలకృష్ణ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: