సైంధవ్ : వెంకటేష్ పై భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ..!

Pulgam Srinivas
విక్టరీ వెంకటేష్ ఆఖరుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 3 అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కూడా హీరో గా నటించగా ... తమన్నా ... మెహరీన్ ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా ఉంటే తాజాగా వెంకటేష్ "రానా నాయుడు" అనే వెబ్ సిరీస్ లో నటించాడు.


ఈ వెబ్ సిరీస్ కొన్ని రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ వెబ్ సీరీస్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ లో రానా కూడా కీలక పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వెంకటేష్ "సైంధవ్" అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. హిట్ ది ఫస్ట్ కేస్ ... హిట్ ది సెకండ్ కేస్ మూవీ లకు దర్శకత్వం వహించి దర్శకుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.


 ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ... వాటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయింది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన రెండవ షెడ్యూల్ షూటింగ్ ను ఈ మూవీ యూనిట్ వైజాగ్ లో ప్రారంభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వెంకటేష్ పై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం తెరకెక్కిస్తున్న యాక్షన్ సన్నివేశాలు ఈ మూవీ కి హైలైట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లో యాక్షన్ సన్నివేశాలు అత్యంత కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: