మన సంస్కృతిని కాపాడుకుందాం : నమిత

murali krishna
నటి నమిత  గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరం లేదు.. నమిత తెలుగు లో జెమినీ, బిల్లా,సింహా,సొంతం మరియు ఒక రాజు ఒక రాణి లాంటి సినిమాల్లో నటించి తన నటన తో మెప్పించింది.
సింహా సినిమాతో ప్రేక్షకుల కు మరింత దగ్గర అయ్యింది. ఈమె నటించినది తక్కువ సినిమాలే అయినప్పటి కీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది నమిత. ఇకపోతే నమిత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉన్నప్పటి కీ సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానుల తో  చాట్ చేస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ నమిత తన సోషల్ మీడియా ఖాతా లో ఒక వీడియోని పోస్ట్ చేసింది. బీజేపీని  ట్యాగ్ చేస్తూ ఆ వీడియోలో ఈ విధంగా చెప్పుకొచ్చింది. మామూలు గా కొత్త సంవత్సరం రోజున జనవరి ఒకటవ తేదీన మనం స్నేహితులతో కలిసి బయటికి వెళ్లి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాం.స్నేహితులతో ఫ్యామిలీ తో కలిసి డాన్సులు చిందులు కూడా వేస్తూ ఉంటాం. కానీ అది మన సంస్కృతి అయితే కాదు. మనకంటూ ఒక సంస్కృతి అయితే ఉంది. చిత్తిరై మాసం మొదటి రోజైన ఏప్రిల్ 14వ తేదీన మన ఉగాది.అదే మనకు కొత్త సంవత్సరాది. ఆ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి నూతన సంవత్సరానికి మనం స్వాగతం పలుకుదాం. ఆలయాల కు వెళ్ళి భక్తి శ్రద్ధల తో మన ఇష్టదైవాన్ని ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరికీ తమిళ నూతన ఉగాది శుభాకాంక్షలు చెప్పుకొచ్చిందట నమిత. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడం తో కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండ గా మరికొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: