సాయి ధరమ్ తేజ్..ఈ మెగా మేనల్లుడు ప్రస్తుతం ఉన్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్స్ లో ఒకరు.
పెళ్లి వయసు దాటిపోతున్న
పెళ్లి చేసుకోకుండా ఉన్నఈ
టాలీవుడ్ యంగ్
హీరో గురించి చాల రోజులుగా సోషల్ మీడియాలో
ప్రేమ,
పెళ్లి అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. పలానా
హీరోయిన్ తో ఎఫైర్ అంటూ ఎన్నో వార్తలు వస్తున్న కూడా వాటిని లెక్క చేయకుండా ప్రమాదం తర్వాత కోలుకొని ప్రస్తుతం తన సినిమాలపైనే ఫుల్ ఫోకస్ చేస్తున్నాడు. ఈ నెల 21 న
సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష విడుదలకు సిద్ధం అవుతుంది.
ఈ క్రమం లో
సినిమా ప్రమోషన్ ఇంటర్వూస్ ఇస్తూ సాయి ఫుల్ బిజీ గా ఉన్నాడు. అయితే ఒక ఇంటర్వ్యూ లో
సాయి ధరమ్ తేజ్ కి
పెళ్లి,
ప్రేమ వంటి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురు కాగా, అతడు తనదైన రీతిలో స్పందించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు. ఎవరైనా తన
పెళ్లి ఎప్పుడు అని అడిగితే దానికి సమాధానం చెప్పను అని, తనకు ఇప్పుడు
పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని, ఎప్పుడు చేసుకోవాలి అనిపిస్తే అప్పుడే
పెళ్లి చేసుకుంటాని అని చెప్పాడు.
అంతటితో ఆగకుండా తన గత
లవ్ స్టోరీ గురించి కూడా చెప్పేసాడు సాయి ధరమ్ తేజ్. తాను గతం లో ఒక
అమ్మాయి ని ప్రేమించినా మాట నిజమే కానీ కొన్ని కారణాల వల్ల తాము విడిపోయాము అని, ప్రస్తుతం
ప్రేమ,
అమ్మాయి అనే పేర్లు వింటేనే భయంగా ఉంటుంది అని చెప్పాడు. ఇక
సినిమా విషయానికి వస్తే
కార్తీక్ దండు అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో
డైరెక్టర్ గా మారుతున్నాడు. అతడు
సుకుమార్ శిష్యుడు కావడం విశేషం. సంయుక్త
మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఇదొక సస్పెన్స్
థ్రిల్లర్ గా తెరకెక్కింది.
సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడం విశేషము.