పవన్ తో అల్లరి చేసిన ఈ చిన్నారి.. ఇప్పుడెలా ఉందో చూడండి?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన వారు ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కూడా ఎంట్రీ ఇచ్చి బాగా రాణిస్తున్న వారు ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గురించి వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బాలు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి అల్లరి చేసిన చైల్డ్ ఆర్టిస్టును ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదు అని చెప్పాలి.



 ముద్దు ముద్దు మాటలతో ఈ చిన్నారి అప్పట్లో ఎంతో పాపులారిటీ సంపాదించింది. ఇక ఇప్పుడు ఈ చిన్నారిని చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు అందరూ మెచ్చిన క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.  బాక్స్ ఆఫీస్ వద్ద రెండు సూపర్ హిట్లను అందుకుంది అని చెప్పాలి. ఆమె ఎవరో కాదు బలగం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కావ్య కళ్యాణ్రామ్. అప్పట్లో గంగోత్రితో చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రస్తానాన్ని మొదలుపెట్టిన ఈ బ్యూటీ తర్వాత చిరంజీవి ఠాగూర్, నాగార్జున స్నేహమంటే ఇదేరా, పవన్ కళ్యాణ్ బాలు లాంటి సినిమాల్లో నటించింది.


 దాదాపు 16 సినిమాల్లో బాలనాటిగా మెప్పించింది. ఆ తర్వాత చదువు కోసం ఇక సినిమాలకు దూరమైపోయింది. మసూద  సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది కావ్య. తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బలగం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. త్వరలోనే వస్తాద్ అనే సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కావ్య కళ్యాణ్రామ్ ఇటీవల తన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా అవి వైరల్ గా మారిపోతున్నాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: