ఎన్టీఆర్ మూవీ ఆఫర్ ను ఆ స్టార్ నటుడు రిజెక్ట్ చేశాడు అన్న వార్తలు ఏ మాత్రం వాస్తవం లేదట..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం లో రూపొందినటు వంటి ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రపంచ వ్యాప్తం గా గుర్తింపును సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ లలో ఒకరి గా కెరియర్ ను కొనసాగిస్తున్న కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు .  ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది.

మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన రెండవ షెడ్యూల్ షూటింగ్ ను కూడా ఈ చిత్ర బృందం ప్రారంభించబోతుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా అంటే ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు కొన్ని వార్తలు బయటికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

ఆ తర్వాత ఎన్టీఆర్ ... కొరటాల మూవీ లో విలన్ పాత్ర కోసం సైఫ్ అలీ ఖాన్ ను ఈ చిత్ర బృందం సంప్రదించగా ... ఈ మూవీ ఆఫర్ ను సైఫ్ రిజెక్ట్ చేసినట్లు అనేక వార్తలు వచ్చాయి. కాకపోతే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ... కొరటాల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ లో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నట్లు ... ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఈ నెల చివరన వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: