లోక నాయకుడు కమల్ హాసన్ పోయిన సంవత్సరం విడుదల అయినటు వంటి పాన్ ఇండియా మూవీ విక్రమ్ తో అదిరిపోయే మాస్ బ్లాక్ బస్టర్ హిట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే . చాలా సంవత్సరాలుగా సరైన విజయం లేక బాక్స్ ఆఫీస్ దగ్గర డీల పడిపోయిన కమల్ "విక్రమ్" మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు .
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కమల్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకు లలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఇండియన్ 2 లో హీరో గా నటిస్తున్నాడు . ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచన లో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ... రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు .
ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది . ఈ మూవీ లోని స్పెషల్ సాంగ్ లో హాట్ బ్యూటీ మలేఖ అరోరా ను చిత్ర బృందం తీసుకోనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సాంగ్ లో కమల్ కూడా అదిరిపోయే మాస్ స్టెప్ లు వెయ్యనున్నట్లు వార్తలు వస్తున్నాయి . ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఇండియన్ మూవీ అద్భుతమైన విజయం సాధించడం తో ఇండియన్ 2 మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్ష కుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి .