నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కీర్తి సురేష్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో మార్చి 30 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ కి మంచి టాక్ రావడంతో ప్రస్తుతం ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్ల గొట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ మూవీ గా నిలిచింది. ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ... సత్యన్ సూర్యన్ ఫోటోగ్రఫిని అందించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విజయంలో చాలా సన్నివేశాలు కీలక పాత్రను పోషించాయి. అలా ఈ మూవీ విజయంలో కీలక పాత్రను పోషించిన సన్నివేశాలలో క్రికెట్ సన్నివేశం ఒకటి. ఈ క్రికెట్ సన్నివేశం అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
అలాగే ఈ సన్నివేశానికి వచ్చే పాట కూడా అదే స్థాయిలో ఉంటుంది. దానితో ఈ సీన్ మరింతగా ఎలివేట్ అయ్యి ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టు కుంటుంది. ఈ సినిమాలో క్రికెట్ సన్నివేశానికి వచ్చే ర్యాప్ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఇక ఆ సీన్ లో వచ్చే ర్యాప్ వీడియో సాంగ్ ని ఈ రోజు మధ్యాహ్నం 3 గం. 6 ని. లకు రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోని నటనకు గాను నాని కి కీర్తి సురేష్ కు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.