నా ఇల్లు వాడుకున్నాడు.. కనీసం వేణు థ్యాంక్స్ కూడా చెప్పలేదు?
ఈ క్రమంలోనే చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని కూడా మానవత విలువలను గుర్తు చేసి కంటతడి పెట్టేలా చేసింది. ఈ సినిమా ద్వారా జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారిపోయాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. ఇక ఈ సినిమాలో చూపించిన కొమరయ్య ఇల్లు అటు కోనరావుపేట మండలం కోలనూరు గ్రామంలో ఉంది. ఇకపోతే ఈ ఇంటి యజమాని రవీందర్రావు ఇటీవల దర్శకుడు వేణు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బలగం డైరెక్టర్ వేణుది తమ ఊరే అంటూ రవీందర్రావు చెప్పుకొచ్చాడు. అయితే సాయం చేయమని అడిగితే ఇక తన ఇల్లు షూటింగ్ కోసం ఇచ్చాను అంటూ తెలిపాడు. ఇక నెలన్నర రోజులు తన ఇంట్లోనే షూటింగ్ చేశారని.. ఇక ఆ సమయంలో తాము వేరే ఇంట్లో అద్దెకు తీసుకొని ఉన్నామని చెప్పుకొచ్చాడు. అయితే షూటింగ్ చేసినందుకు డబ్బులు ఇస్తామని చెప్పారు. కానీ నేను డబ్బులు తీసుకోలేదు. ఇక బలగం సినిమా పెద్ద హిట్ అవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక సినిమాల్లో తమ ఇల్లు ఉన్నందుకు మరింత సంతోష పడుతున్నాను. సినిమా షూటింగ్ సమయంలో ఎప్పుడు దిల్ రాజు రాలేదని.. ఇక ఆయన కూతురు తమ్ముడి కొడుకు మాత్రమే నిర్మాణ బాధ్యతలను చూసుకున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సినిమా సక్సెస్ అయ్యాక ఇంటిని ఇచ్చినందుకు వేణు కనీసం థాంక్స్ కూడా చెప్పలేదని.. అయితే తన దగ్గర వేణు నెంబర్ ఉన్నప్పటికీ ఫోన్ చేయలేదు అంటూ రవీందర్రావు చెప్పుకొచ్చాడు.