అది బ్యాన్ చేయాలంటూ కామెడీ చేసిన హైపర్ ఆది....!!

murali krishna
బుల్లితెర టాలెంటెడ్ కమెడియన్ల లో ఒకరైన హైపర్ ఆదిని అభిమానించే వాళ్లు ఏ స్థాయిలో ఉన్నారో విమర్శించే వాళ్లు సైతం అదే స్థాయిలో ఉన్నారు.
హైపర్ ఆది స్కిట్ల లో ద్వందార్థాలు ఉంటాయని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈటీవీ షో లో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలైంది. సుబ్బడు, వెంకడు, రంగడు, తిప్పడు ఇలా వచ్చిన మొగుళ్లు వచ్చినట్టు పెళ్లాం చేతి లో బలవుతుంటే ఈసారి వచ్చే మొగుడు బలయ్యేవాడు కాదని బలిచ్చేవాడు అని వచ్చాడురా హైపర్ ఆది అంటూ ఆది ఇంట్రడక్షన్ వెరైటీ గా ఇచ్చారు.
భర్తంటే భరించే వాడు కాదు బరి తెగించేవాడు అని ఈరోజు నిరూపిస్తా అంటూ హైపర్ ఆది కామెంట్ చేశారు. ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు కన్ఫ్యూజ్ అయితే ఎవరి పెళ్లాం అని కూడా చూడను అంటూ ఆది సెటైరికల్ గా కామెంట్లు చేశారు. ఆ తర్వాత హైపర్ ఆది సంక్రాంతి పండుగకు చీర అడుగుతారని కానీ ఆ చీర కట్టరని అన్నారు. ఒక నైటీ వేసుకుంటారని ఆ నైటీతో నే పిల్లాడి ముక్కు చీదుతారని అది కడుగుతారని అన్నీ వాటితోనే చేసి ఆ నైటీతో మా దగ్గరికి వస్తారని చెప్పుకొచ్చారు.
గవర్నమెంట్ వాళ్ల కు చెబుతున్నానని ప్లాస్టిక్ కాదు ఆ నైటీలను బ్యాన్ చేయండి మీకు దండం పెడతానని హైపర్ ఆది చెప్పుకొచ్చారు. అయితే హైపర్ ఆది కామెడీ వేస్తున్న పంచ్ లు హద్దులు దాటుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రోమోకు దాదాపు గా నాలుగున్నర లక్షల వ్యూస్ వచ్చాయి.
హైపర్ ఆది కామెడీ చిరాకు తెప్పించే లా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆడవాళ్ల డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేసే ముందు హైపర్ ఆది ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: