తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న
యువ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న
నాగ చైతన్య పోయిన సంవత్సరం ఏకంగా మూడు
మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. పోయిన సంవత్సరం మూడు
మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన
నాగ చైతన్య ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఒక్క
మూవీ తో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా
నాగ చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందినటు వంటి కస్టడీ అనే సినిమాలో
హీరో గా నటించాడు. కృతి శెట్టి ఈ
మూవీ లో
చైతన్య సరసన
హీరోయిన్ గా నటించింది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో బంగార్రాజు అనే
మూవీ రూపొంది మంచి విజయం సాధించింది. వీరి కాంబినేషన్ లో కస్టడీ రెండవ సినిమా.
ఈ
మూవీ కి ఇళయ
రాజా ... యువన్
శంకర్ రాజా సంగీతం అందించగా ... అరవింద స్వామి ...
ప్రియమణి ఈ
మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ
మూవీ లో
చైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ
మూవీ ని మే 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా ప్రమోషన్ లను ఇప్పటికే మొదలు పెట్టింది. అందులో భాగంగా తాజాగా ఈ
సినిమా బృందం ఈ
మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ను విడుదల చేసింది.
తాజాగా కస్టడీ
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి "హెడ్ అప్ హై" అంటూ సాగే మొదటి పాటను తాజాగా విడుదల చేసింది. ఈ పాటకు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ
మూవీ ని తెలుగు మరియు
తమిళ భాషల్లో ఒకే రోజు విడుదల చేయనున్నారు. ఈ
మూవీ మంచి విజయం సాధించినట్లు అయితే
చైతన్య కు
తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.