టాలీవుడ్ యువ హీరో సాయి ధరమ్ తేజ్ ఆఖరుగా దేవాకట్టా దర్శకత్వంలో రూపొందినటువంటి రిపబ్లిక్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లను అందుకుంది. ఈ మూవీ లోని నటనకు గాను సాయి తేజ్ కు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి.
ఇలా రిపబ్లిక్ లాంటి మంచి డీసెంట్ విజయం తర్వాత సాయి తేజ "విరూపాక్ష" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏలూరు లోని ... సి ఆర్ రెడ్డి కాలేజీ లో ... ఏప్రిల్ 16 వ తేదీన సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న ఇద్దరు స్టార్ ప్రొడ్యూసర్లు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ ... దిల్ రాజు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నట్లు ... అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లో వెలువడబోతున్నట్లు తెలుస్తుంది.