పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ ప్రస్తుతం వరుస
సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే పవన్
తమిళ సినిమా వినోదయ సీతం
రీమేక్ షూటింగ్ ను ప్రారంభించి ఇప్పటికే తన భాగం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నాడు. అలాగే మరి కొన్ని రోజుల్లోనే పవన్ "హరిహర వీరమల్లు"
మూవీ షూటింగ్ ను కూడా తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ
మూవీ లో కూడా తన భాగం షూటింగ్ ను మరికొన్ని రోజుల్లోనే పవన్ పూర్తి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే పవన్ ...
హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్
మూవీ షూటింగ్ ను కూడా ప్రారంభించాడు.
ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ
మూవీ లో పవన్
పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది వరకు పవన్ ... హరీష్ కాంబినేషన్ లో రూపొందిన
గబ్బర్ సింగ్ మూవీ లో కూడా పవన్
పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడం ఉస్తాద్ భగత్ సింగ్
మూవీ లో కూడా పవన్
పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ
మూవీ పై పవన్ అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగి పోయాయి. ఇది ఇలా ఉంటే పవన్ ...
సుజిత్ దర్శకత్వంలో "ఓ జి" అనే
మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ నెల చివరన పవన్ హీరోగా రూపొందబోయే "ఓ జి"
మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు ... వచ్చేనెల మొదటి వారంలో పవన్ ఈ
మూవీ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ షూటింగ్ ను భారీ యాక్షన్ సన్నివేశాలతో మొదలు పెట్టే ఆలోచనలో ఈ
మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యప్షన్ సన్నివేశం ఈ
మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది.