దసరా సినిమా నుంచి డిలీట్ సీన్.. వైరల్..!!
సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈ దసరా సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలకమైన పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్స్ కూడా ప్రేక్షకుల బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవల కాలంలో వెన్నెల మాస్ డాన్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది ..ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ డాన్స్ వైరల్ గా మారుతుంది తాజాగా ఈ సినిమా నుంచి డిలీట్ అయిన ఒక సన్నివేశాన్ని చిత్ర బృందం రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఇక ఇందులో ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని వెన్నెల ఆవేదనను చూడవచ్చు.. వెన్నెల తన తల్లి మధ్య జరిగే సంభాషణకు సంబంధించి ఈ వీడియో ఉన్నట్టుగా ఈ వీడియోని చూస్తే మనకి అర్థమవుతోంది. ముఖ్యంగా కీర్తి సురేష్ చెప్పే డైలాగు కూడా అందరిని ఎమోషనల్ కి గురయ్యాల చేస్తోంది.. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో మాత్రం తెగ వైరల్ గా మారుతోంది.. దసరా సినిమా నుంచి ఇలాంటి మంచి సన్నివేశాన్ని ఎందుకు డిలీట్ చేశారు అంటే చిత్ర బృందాన్ని అభిమానులు సైతం కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. నాని ఈ సినిమాలు ఊర మాసలేవలో కనిపించారు. ధరణి పేరుతో ఈ చిత్రంలో నటించడం జరిగింది నాని.