సల్మాన్ "కిసీ కా భాయ్ కిసీ కా జాన్" మూవీ ట్రైలర్ ఈరోజు ఆ సమయానికి విడుదల..!

Pulgam Srinivas
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా "కిసీ కా భాయ్ కిసీ కా జాన్" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... జగపతిబాబు కూడా ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక సాంగ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించనున్నాడు.


ఈ సాంగ్ ను ఇప్పటికే ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను ఏప్రిల్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిటీ ఈ సినిమాను ఏప్రిల్ 10 వ తేదీన ఏ సమయానికి విడుదల చేయబోతున్నది అధికారికంగా ప్రకటించింది.


 ఈ మూవీ యొక్క ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుండి ఇప్పటి వరకు చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్ని కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఈ మూవీ ట్రైలర్ పై సల్మాన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ మూవీ ని సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మించగా ... ఫర్హాద్ సమ్జి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. పూజా హెగ్డే ఈ మూవీ లో సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: