ఆ హీరోనే నా సినీ కెరీర్ ని మార్చారు శృతిహాసన్...!!

Divya
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన వారిలో శృతిహాసన్ కూడా ఒకరు.. అందాల హీరోయిన్గా పేరుపొందింది హీరోయిన్ శృతిహాసన్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది.. క్రాక్ సినిమా తర్వాత ఈ అమ్మడు ఫుల్ బిజీగా మారిపోయింది. రీసెంట్గా బాలయ్య, చిరంజీవి తో కలిసి నటించిన చిత్రాలు కూడా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ విజయంగా అందుకున్నాయి. అలాగే పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది.ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ లో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తమిళ్ హిందీలో కూడా పలు భాషలలో నటించింది.


తాజాగా శృతిహాసన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను హీరోల వయసును పట్టించుకోనని నేను నటించిన సినిమాలన్నిటినీ గురించి కూడా చెప్పుకొచ్చింది. సీనియర్ హీరోలకు జోడిగా నటించడం గురించి కొంతమంది తనని విమర్శలు చేశారని కానీ అసలు తన గురించి పట్టించుకోలేదని తెలియజేసింది శృతిహాసన్ అలాగే వివాహం గురించి కూడా మాట్లాడుతూ.. జీవితంలో వివాహం అనేది ఒక భాగం అని తెలియజేసింది దాని గురించి ఇప్పుడప్పుడే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా తెలిపింది.


హిందీలో తన సినిమా కెరియర్ మొదలయ్యింది.. పవన్ హీరోగా తెరకెక్కించిన గబ్బర్ సింగ్ సినిమాతో తన జాతకం మారిపోయిందంటూ తెలియజేసింది.మా నాన్న బ్యానర్ లో తెరకెక్కి సినిమాలలో నటించే అవకాశం వస్తే ఖచ్చితంగా వదులుకోనని తెలియజేసింది శృతిహాసన్. ప్రస్తుతం హీరోయిన్గా శృతిహాసన్ ఒకో సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. శృతిహాసన్ గతంలో ఎన్నో రూమర్స్ కూడా వినిపించాయి ఈమె ఎక్కువగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటుంది.. ప్రస్తుతం శృతిహాసన్ చేసిన ఈ కామెంట్లు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: