మరొక షాక్ ఇవ్వడానికి సిద్ధమైన నరేష్- పవిత్ర లోకేష్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో నరేష్, పవిత్ర పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం వీరి వయసు 50 ఏళ్లు అయినప్పటికీ ఇప్పుడు ప్రేమలో ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నరేష్ ,పవిత్ర లోకేష్.. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ నరేష్ కు మాత్రం విడాకులు క్లియర్ కాకపోవడంతో వీరిద్దరి కేవలం సహజీవనం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రేమని వ్యక్తం చేసుకోని పెళ్లి కూడా చేసుకున్నట్లుగా కొన్ని వీడియోలను విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చారు..

అయితే తీరా అది చూస్తే ఒక సినిమా కోసం ఆన్నట్లుగా తెలుస్తోంది.. అదే మళ్లీ పెళ్లి.. ఈ సందర్భంగా ఈ సినిమాని ఎమ్మెస్ రాజు తెరకెక్కించబోతున్నారు. ఇందులో పెద్ద వయసులో ప్రేమ పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రం సాగిపోతుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ని కూడా ప్రకటించింది చిత్ర బృందం.. త్వరలోనే ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నామని ఈనెల 13న విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. ఈ మేరకు ఒక కొత్త పోస్ట్ విడుదల చేయడం జరిగింది. ఇందులో నరేష్ ఒక కోటును ధరించి పవిత్ర లోకేష్ చీరలో మెరిసిపోతోంది

ఇక సినిమా పోస్టర్ కి తగ్గట్టుగానే వీరు దుస్తులు ఉండడంతో ఈ పోస్టర్ మరింత వైరల్ గా మారుతోంది.. ఈ ముదురు జంట ఈ వయసులో కూడా తమ విశ్వరూపాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది.  నరేష్ చిత్ర పరిశ్రమ లోకి వచ్చి ఇప్పటికీ 50 సంవత్సరాలు అవుతోంది.. ఈ సందర్భంగా గోల్డెన్ జూబ్లీహియర్స్ ఫిలిమ్స్ గా మళ్లీ పెళ్లి అనే సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో తనకు కాబోయే భార్యతో కలిసి నటిస్తూ ఉండడం మరొక విశేషమని చెప్పవచ్చు.. ఈ చిత్రాన్ని విజయ్ కృష్ణ మూవీస్ పతాకంపై వికే నరేష్ తెలుగు కన్నడలో నిర్మిస్తూ ఉన్నారు. మరి ఈసారి ఎలాంటి షాక్ ఇస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: