తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో తాజాగా మీటర్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ రేపు అనగా ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టు కోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే రేంజ్ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలా ప్రేక్షకుల్లో ఈ మూవీ పై పరవాలేదు అనే రేంజ్ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా డీసెంట్ థియేటర్ ల సంఖ్య లో విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్ లలో విడుదల కాబతుందో తెలుసుకుందాం.
ఈ మూవీ నైజాం ఏరియాలో 85 థియేటర్ లలో విడుదల కానుండగా ... సీడెడ్ లో 35 థియేటర్ లలో ... ఆంధ్ర లో 130 థియేటర్ లలో విడుదల కానుంది. మొత్తంగా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 250 థియేటర్ లలో విడుదల కానుంది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని ఈ మూవీ 150 ప్లస్ థియేటర్ లలో విడుదల కానుంది. మొత్తంగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 థియేటర్ లలో విడుదల కానుంది.
ఇలా డీసెంట్ నెంబర్ థియేటర్ లలో విడుదల కావడానికి రెడీగా ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.