నందమూరి నటసింహం
బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో 108 వ
మూవీ గా రూపొందుతున్న సినిమాలో
హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి
పటాస్ సినిమాతో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత
సుప్రీమ్ ...
రాజా ది గ్రేట్ ... ఎఫ్ 2 ... సరలేను నీకెవ్వరు ... ఎఫ్ 3 వంటి
మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు
సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నటు వంటి
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ
మూవీ లో
బాలయ్య సరసన మోస్ట్
బ్యూటిఫుల్ నటి
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ప్రస్తుతం తెలుగు
సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్
జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న
శ్రీ లీల ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది.
తమన్ ఈ
మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది.
ఇప్పటికే ఈ
మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ
మూవీ ని ఈ సంవత్సరం
దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చింది. తాజాగా ఈ
మూవీ యూనిట్ గణేశుడిపై సాగే పాట కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సెట్ లోనే
బాలయ్య ...
శ్రీ లీల పై ఎంతో గ్రాండ్ గా ఈ పాటను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సాంగ్ చిత్రీకరణకు ఏకంగా 5 కోట్లు ఖర్చు కాబోతున్నట్లు తెలుస్తోంది.