సినిమా
ఇండస్ట్రీ లోకి ఎంతో మంది దర్శకులు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది మాత్రమే దర్శకత్వం వహించిన డెబ్యూ
మూవీ తోని అద్భుతమైన క్రేజ్ ను ... అద్భుతమైన విజయాన్ని సంపాదించుకుంటారు. అలాంటి వారిలో
శ్రీకాంత్ ఓదెల ఒకరు. ఈ దర్శకుడు తాజాగా విడుదల అయినటు వంటి
దసరా మూవీ తో దర్శకుడి గా కెరియర్ ను మొదలు పెట్టాడు.
నాచురల్ స్టార్
నాని హీరో గా రూపొందిన ఈ
మూవీ లో
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ
మార్చి 30 వ తేదీన తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో విడుదల అయిన ఈ
మూవీ అన్ని ప్రాంతాల నుండి పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లని
బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇప్పటికే ఈ
మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకుంటుంది.
ప్రస్తుతం ఈ
మూవీ బ్లాక్ బాస్టర్ దిశగా పయనిస్తోంది. ఇలా మొదటి
మూవీ తోనే దర్శకుడిగా అద్భుతమైన విజయాన్ని అందుకున్న
శ్రీకాంత్ కు తదుపరి
మూవీ కి అదిరిపోయే క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం
శ్రీకాంత్ ఓదెల కు
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయినటు వంటి అక్కినేని
అఖిల్ తో
మూవీ చేసే అవకాశం దక్కినట్లు ... ప్రస్తుతం ఈ దర్శకుడు
అఖిల్ కోసం అద్భుతమైన కథను రెడీ చేస్తున్నట్లు ... అన్ని కుదిరితే
అఖిల్ ...
శ్రీకాంత్ కాంబినేషన్ లో అదిరిపోయే ఒక
మూవీ రాబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం
అఖిల్ "ఏజెంట్"
మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు.