ప్రీ టీజర్ తోనే అదరగొట్టేస్తున్న పుష్ప రాజ్..!

Divya
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా పుష్ప: ది రూల్.. ఈ సినిమాకు సంబంధించి ఎప్పటినుండో అభిమానులు అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప పార్ట్ వన్ ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా రేంజ్ లో మంచి హిట్ అవడమే కాకుండా నార్త్ లో కూడా సీక్వెల్ కోసం ఎదురు చూసేలా చేశారు సుకుమార్. అందుకే ఇప్పుడు స్క్రీన్ ప్లే స్టోరీ విషయంలో పుష్పకి 10 రెట్లు బెటర్ గా ఉండే విధంగా పనిచేస్తున్నారు సుకుమార్. ఫైనల్ గా స్క్రీన్ ప్లే .. ఆన్ పేపర్ మీద చాలా అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది.
ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ టీజర్ ని విడుదల చేశారు.  ఇందులో పుష్ప రాజ్ కథ ఎక్కడి నుంచి మొదలైంది అనేది స్పష్టం చేశారు. పోలీసులు పుష్పరాజును అరెస్టు చేసి తిరుపతి జైల్లో దాచిపెడితే.. ఆయన అక్కడి నుంచి పారిపోతాడు.. ఆ తర్వాత పుష్ప  ఎక్కడికెళ్లాడు? ఏమైపోయాడు ?అనేది ఏప్రిల్ ఏడవ తేదీ సాయంత్రం వరకు వేచి ఉండాల్సిందే. ఆరోజు సాయంత్రం 4:07 పూర్తి టీజర్ను విడుదల చేయబోతున్నామని చిత్ర బృందం ప్రకటించింది. టీజర్ కి సంబంధించిన ప్రీ టీజర్ ను విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తి పెంచేశారు సుకుమార్.
టీజర్ ద్వారానే పాన్ ఇండియా రికార్డులను బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సుకుమార్ తెలుస్తోంది.  ముఖ్యంగా ఖచ్చితంగా ఈసారి రికార్డులన్నీ బ్రేక్ చేస్తాను అని హింట్ ఇచ్చే విధంగా ఆయన తన టీజర్ను రూపొందించుకున్నారట. ఇకపోతే అల్లు అర్జున్ సినిమా కోసం అభిమానులే కాదు యావత్ దేశ సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం పుష్పా సినిమా అని చెప్పాలి.  ఇకపోతే అల్లు అర్జున్ దృష్టి అంతా వెయ్యికోట్ల కలెక్షన్ గ్రాస్ పైనే పెట్టినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే రూ.200 కోట్ల ఓటీటీ రైట్స్ కూడా దక్కించుకుంది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: