"మీటర్" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ... వేదిక పిక్స్..!

Pulgam Srinivas
రాజా వారు రాణి గారు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకున్న యువ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకున్న ఈ యువ హీరో ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం అనే యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.
 


ఈ మూవీ తో ఈ హీరో క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో బాగానే పెరిగింది. ఆ తర్వాత వరుస మూవీ లలో హీరో గా నటిస్తూ వస్తున్న ఈ యువ హీరో ఇప్పటికే కొన్ని విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అందుకున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రారంభంలో వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ తో ఈ హీరో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో మీటర్ అనే మూవీ లో హీరో గా నటించాడు.


రమేష్ కాడూరి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సాయి కార్తీక్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన సమయాన్ని ... వేదికను ఖరారు చేసింది. అందుకు సంబంధించిన ప్రకటనను కూడా తాజాగా విడుదల చేసింది. ఏప్రిల్ 5 వ తేదీన ఉదయం 11 గంటలకు ... దస్పల్ల కన్వెన్షన్  ... హైదరాబాద్ లో ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: