నాని కొత్త సినిమా లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని ఇప్పటికే తన తదుపరి మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ ను చాలా రోజుల క్రితమే ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే ఆ మూవీ కి సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఆ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ మొదలు కాక ముందే ప్రేక్షకుల్లో ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నాని కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందిపోతుంది. ఈ మూవీ కి  శౌర్యువ్‌ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ దర్శకుడు ఈ మూవీ తో దర్శకుడి గా తన కెరియర్ ను మొదలు పెట్టబోతున్నాడు.


ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సీత రామం మూవీ లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును మంచి విజయాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న మృణల్ ఠాగూర్ ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యొక్క మొదటి షెడ్యూల్ గోవా లో ప్రారంభం అయింది. ఈ మూవీ తాజా షెడ్యూల్ గోవా లో కంటిన్యూ గా 40 రోజుల పాటు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఈ చిత్ర బృందం ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్న కీలక నటీ నటులపై అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరించ బోతున్నట్లు తెలుస్తోంది.


గోవా షెడ్యూల్లో భాగంగా చిత్ర బృందం తెరకెక్కించ బోయే సన్నివేశాలు ఈ మూవీ లోనే హైలెట్ గా నిలవ బోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా నాని "దసరా" మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా నాని "దసరా" లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నటిస్తున్న మూవీ కావడంతో నాని 30 వ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: