కిరణ్ అబ్బవరం "మీటర్" టైటిల్ సాంగ్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న యువ హీరో లలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ యువ హీరో రాజా వారు రాణి గారు అనే మూవీ తో హీరో గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ తో ఈ హీరో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇలా వరుసగా రెండు విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ యువ హీరో ఆ తర్వాత వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
 


అందులో భాగంగా ఇప్పటికే అనేక మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన యువ హీరో సమ్మతమే తాజాగా ఈ సంవత్సరం విడుదల అయిన వినరో భాగ్యము విష్ణు కథ అనే రెండు మూవీ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాడు. ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న ఈ యువ హీరో తాజాగా మీటర్ అనే మూవీ లో హీరో గా నటించాడు.


 రమేష్ కాడూరి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఏ మూవీ యూనిటీ సినిమా ప్రమోషన్ లను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ నుండి టైటిల్ సాంగ్ ను ఏప్రిల్ 4 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఈ మూవీ కి సాయి కార్తీక్ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: