"బలగం" మూవీ పై ప్రశంసల వర్షం కురిపించిన మారుతి..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి ప్రియదర్శి తాజాగా బలగం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ లో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గ నటించగా కమెడియన్ వేణు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పెద్దగా అలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా సూపర్ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమా గత కొన్ని రోజులుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ "ఓ టి టి" లోకి వచ్చాక కూడా ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇలా అద్భుతమైన విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి సూపర్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న బలగం మూవీ పై తాజాగా దర్శకుడు మారుతి ప్రశంశాల వర్షం కురిపించారు.

మారుతి తాజాగా బలగం మూవీ గురించి స్పందిస్తూ ... నిన్న రాత్రి బలగం మూవీ చూసాను. మూవీ లో తెలంగాణ సంస్కృతి మరియు సాంప్రదాయాలను వర్ణించిన తీరు చూసి నా మనసుకి హత్తుకుంది. బలగం మూవీ లోని ఎమోషన్స్ నాకు బాగా నచ్చాయి.  బలగం సినిమాకి వేణు దర్శకత్వం వహించాడు అని తెలిసి చాలా సంతోషించాను. ప్రతిరోజూ పండగే సినిమా టైం లో నేను అనుభవించిన ఎమోషన్ ఇంపాక్ట్ ను గుర్తు చేసుకున్నందుకు గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. తదుపరి ప్రాజెక్ట్స్ లో వేణు కి మంచి విజయం దక్కాలి అని కోరుకుంటున్నాను అని మారుతి చెప్పుకొచ్చాడు. అలాగే బలగం మూవీ యూనిట్ కి కంగ్రాట్స్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: