"సలార్" మూవీ ఓవర్సీస్ హక్కుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను క్రియేట్ చేసుకుని ఆ తర్వాత బాహుబలి సీరీస్ మూవీ ల ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అద్భుతమైన రేంజ్ క్రేజ్ ను ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితం ప్రారంభం అయిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన కేవలం ఒకే ఒక్క షెడ్యూల్ షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను కూడా మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ యూనిట్ ముగించబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే ఈ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. దానితో ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించి ఈ సినిమాను సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేసే విధంగా ఈ మూవీ యూనిట్ ప్లాన్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడడంతో ఈ చిత్ర బృందం ఈ సినిమా థియేటర్ హక్కులను అమ్మి వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఓవర్ సిస్ థియేటర్ హక్కులను భారీ ధరకు అమ్మినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... సలార్ మూవీ యొక్క ఓవర్సీస్ హక్కులను ఈ చిత్ర బృందం 70 కోట్లకు అమ్మినట్లు ... ఒక ప్రముఖ సంస్థ ఈ మూవీ యొక్క హక్కులను కొనుగోలు చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: