వారికి ఇష్టం లేకుండానే ఆ పని..మృణాల్ ఠాకూర్..!!

Divya
టాలీవుడ్ లోకి సీతారామం చిత్రం ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. నార్త్ మరియు సౌత్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇక నానికి జోడిగా తాజాగా ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరొకవైపు బాలీవుడ్ లో కూడా తదుపరి చిత్రాలలో నటిస్తోంది.మృణాల్ ఠాకూర్ వెండితెర బుల్లితెరపై అనే సంబంధం లేకుండా సందడి చేస్తూనే ఉంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొంటూ తన వ్యక్తిగత జీవితంలో తన కెరీర్ గురించి చేసిన వాక్యాలు వైరల్ గా మారుతున్నాయి.

మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రస్తుతం తాడు ఇ స్థాయిలో ఉన్నానంటే కచ్చితంగా తన తల్లితండ్రులే కారణమని తెలియజేస్తోంది.యాక్టింగ్ చేయాలని భావించిన సమయంలో వారు మొదట వద్దని చెప్పారు. సినిమాలు సీరియల్స్ అవసరం లేదన్నారు ఇండస్ట్రీ గురించి వారికి ఉన్న భయం కారణంగానే మొదట వారు అలా చెప్పారని అయితే తల్లిదండ్రులు వారు నా ఇష్టాన్ని కాదనలేకపోయారు.. వారి ప్రోత్సాహం వల్లే టీవీ సీరియల్స్ లో మంచి పాత్రలు చేస్తూ మరాఠీ చిత్రంలో హీరోయిన్గా నటించానని తెలిపింది. కెరియర్ ప్రారంభం అయినప్పటి నుంచి వారు తన విషయంలో గర్విస్తూనే ఉన్నారని తెలుపుతోంది.
 మనం లోగా ఉన్న సమయంలో ఎవరైనా ప్రోత్సహిస్తే బాగుంటుందనుకున్నాము అలాంటి సమయంలో ప్రోత్సాహం లభించకుంటే చాలా బాధగా ఉంటుందని తెలిపింది. ప్రోత్సాహం లేకనంతమాత్రాన విశ్వాసం కోల్పోకూడదని పట్టుదలతో ప్రయత్నించాలని తెలిపింది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం తెలుగులో రెండు మూడు చిత్రాలకు అంగీకరించే దశలో ఉన్నట్లు తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ త్వరలోనే హిందీలో కూడా ఒక సినిమా రాబోతోందని బుల్లితెరపై కూడా అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో సందడి చేస్తూ ఉంటానని తెలుపుతోంది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: