ఉస్తాద్ లో ఆ ముద్దుగుమ్మ కన్ఫామ్..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మైత్రి సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించనుండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ ని అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. అలాగే ఈ మూవీ నుండి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.  ఇది ఇలా ఉంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను ఏప్రిల్ 5 వ తేదీ నుండి మొదలు పెట్ట బోతున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ యొక్క మొదటి షెడ్యూల్ భారీ ఎత్తున నిర్వహించడానికి చిత్ర బృందం ప్లాన్స్ చేస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో పవన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా కనిపించే అవకాశం ఉంది అని గత కొన్ని రోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో శ్రీ లీల కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం మరి కొన్ని రోజుల్లోనే అధికారికంగా ప్రకటించ బోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో రెండవ హీరోయిన్ కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ప్రస్తుతం శ్రీ లల చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. అందులో కొన్ని అదిరిపోయే రేంజ్ సినిమాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: