మహేష్ ట్విట్ దసరా సినిమాకి కలిసొస్తుందా..??

Divya
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఏదైనా సరే తనకు నచ్చితే కచ్చితంగా ఆ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ఉంటారు.. చిన్న పెద్ద అనే స్టార్స్ అనే తేడా లేకుండా.. కొత్తవారు అని తేడా లేకుండా సినిమాని వీక్షించే ట్విట్టర్లో తనదైన స్టైల్ లో రివ్యూ తెలియజేస్తూ ఉంటారు మహేష్ బాబు. ఇక మహేష్ బాబుకు ఉన్న మంచి లక్షణాలలో ఇది కూడా ఒకటి.. ఎంతోమందికి బర్త్డే విషెస్ గానీ స్పెషల్ విషెస్ కానీ ఏదైనా గుర్తుపెట్టుకొని మరి ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఉంటారు మహేష్ బాబు.
తాజాగా మహేష్ బాబు దసరా సినిమా పైన ప్రశంసలు కురిపించారు. నాచురల్ స్టార్ నాని,  కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్  ఓదెల డైరెక్షన్లో వచ్చిన  దసరా సినిమా పాన్ ఇండియాలో విడుదల అయింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తోనే దూసుకుపోతుంది. స్టార్ హీరో నాని టైర్ 2  హీరో నుంచి టైర్ వన్ హీరోగా నిలబెట్టిన సినిమా అని ప్రేక్షకులైతే తెలియజేస్తున్నారు.  దసరా సినిమా పైన మహేష్ బాబు ఇచ్చిన రివ్యూ మరింత హైప్ ని పెంచేలా కనిపిస్తోంది.
దసరా సినిమా చాలా గర్వంగా ఉంది.  అద్భుతమైన సినిమా అంటూ చివర్లో ఫైర్ ఎమోజీలను షేర్ చేశారు మహేష్ బాబు.  ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారుతుంది. మహేష్ ఇంత స్టాండింగ్ రివ్యూ ఇస్తే ఇక ఈ సినిమాకు తిరుగులేదు.  కలెక్షన్లు అదరగొడతాయంటూ కామెంట్ లు పెడుతున్నారు. మరి ముందు ముందు ఇంకే హీరోలు ఈ సినిమా పైన ప్రశంసిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28 వసినిమాలో నటిస్తూ ఉన్నారు ఇందులో హీరోయిన్గా శ్రీ లీల,  పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ చిత్రం అయిపోయిన వెంటనే డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాలో నటించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: