రవితేజ "రావణాసుర" ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పాటలను ... కొన్ని ప్రచార చిత్రాలను అలాగే టీజర్ మరియు ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది.

 ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ మూవీ ట్రైలర్ కు యూట్యూబ్ లో 17 మిలియన్ వ్యూస్ ... 153 కే లైక్స్ లభించాయి. అలాగే ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను అందుకునే రేంజ్ లో ఉండడం తో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ప్రస్తుతం భారీ లెవల్లో అంచనాలు ఉన్నాయి.

మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధిస్తుందో లేదో తెలియాలి అంటే ఏప్రిల్ 7 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా ... సుశాంత్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో రవితేజ సరసన మేఘ ఆకాష్ , దక్ష నాగర్కర్ , పూజిత పొన్నాడ , ఫరియా అబ్దుల్లా , అను ఇమ్మానుయేల్ హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ధమాకా మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ ఈ మూవీ తో ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: