సల్మాన్ మూవీలో తెలంగాణ సాంగ్.. వైరల్?

Purushottham Vinay
ఇక ఈమధ్య కాలంలో తెలంగాణ నేపథ్యంలో వస్తున్న సినిమాలు.. తెలంగాణ యాసలో వస్తున్న డైలాగులు పాటలు చాలా ఎక్కవగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండ్ అవుతున్నాయి. ఇక చాలా మంది హీరోలు కూడా తెలంగాణ యాసలో మాట్లాడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.ఆ నేపథ్యంలో వచ్చిన తెలుగు సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్లుగా నిలిచాయి.ఇక తాజాగా వచ్చిన దసరా సినిమా కూడా తెలంగాణ నేపథ్యం ఉన్న మూవీనే.. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేగాక తాజాగా బాలీవుడ్ లో మన బతుకమ్మ సాంగ్ వినిపించింది. తెలంగాణ సంప్రదాయ జానపద గీతం బతుకమ్మ ఇప్పుడు బాలీవుడ్ కు కూడా చేరింది. సల్మాన్‌ ఖాన్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో తెలంగాణ పువ్వుల పండగ బతుకమ్మ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. 


ఈ బతుకమ్మ పాటకి కేజీఎఫ్‌ ఫేమ్‌ రవిబస్రూర్‌ మ్యూజిక్ అందించారు. బతుకమ్మ పాటను సల్మాన్‌ ఇంకా పూజ హెగ్డే తో పాటు, వెంకటేష్‌ , భూమిక పై షూట్ చేశారు చిత్ర యూనిట్. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా తెరెక్కించిన ఈ పాటకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.కాగా కిసీ కా భాయ్ కిసీ కా జాన్ తమిళంలో సూపర్‌ హిట్టయిన 'వీరమ్‌' సినిమాకు రీమేక్‌. తెలుగులో 'వీరుడొక్కడే' పేరుతో ఈ సినిమా డబ్బింగ్ అయింది. విచిత్రం ఏమిటంటే ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌ హీరోగా కాటమరాయుడిగా తెలుగులో తెరకెక్కింది. ఇక సల్మాన్‌ ఖాన్‌ తన సొంత బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్న ఈ మూవీకి దేవి ప్రసాద్‌, రవి బస్రూర్‌, హిమేశ్ రేషమ్మియా సంగీత దర్శలుగా వ్యవహరిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ కూడా ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: