నాగచైతన్య శోభిత ధూళిపాళ పై మరోసారి షాకింగ్ న్యూస్ !

Seetha Sailaja
సమంతతో నాగచైతన్య విడాకులు తీసుకున్న తరువాత అతడు సినిమాలు చేస్తూనే మరొక వైపు శోభిత ధూళిపాళ తో డేటింగ్ చేస్తున్నాడు అంటూ అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈవిషయాల పై వీరిద్దరూ ఖండన ఇవ్వక పోవడంతో ఈ గాసిప్పులు నిజం అన్న అభిప్రాయానికి చాలామంది వచ్చారు. లేటెస్ట్ గా వీరిద్దరూ కలిసి లండన్ వెళ్ళి అక్కడ హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు వార్తలు కూడ వచ్చాయి.

వీరిద్దరూ లండన్ లో ఒక ప్రముఖ హోటల్ లో ఉన్న్నప్పుడు ఆ హోటల్ కు సంబంధించిన చెఫ్ సురేంద్ర మోహన్ నాగచైతన్యతో సెల్ఫీ తీసుకున్నాడు. ఈ ఫోటోను అతడు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. అయితే ఆఫోటో బ్యాగ్రౌండ్ లో శోభిత తన మొఖం కనిపించకుండా చేయి అడ్డుపెట్టుకొని ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీనితో శోభిత రానున్న రోజులలో అక్కినేని కుటుంబ కోడలుగా మారడం ఖాయం అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన శోభిత ప్రస్తుతం మోడలింగ్ రంగంలో కొనసాగుతూనే సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. 'గూఢచారి' 'మేజర్' సినిమాలలో ఆమె నటించినప్పటికీ పూర్తిగా లీడింగ్ హీరోయిన్ కాలేకపోతోంది.

ప్రస్తుతం ఆమె కెరియర్ అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితులలో చైతూ తో ప్రేమ వ్యవహారాలలో మాత్రం చాల బిజీగా ఉంటోంది అంటున్నారు. నాగచైతన్య మరొకసారి తన మాస్ హీరో ప్రయత్నాలను కొనసాగిస్తూ ప్రస్తుతం ‘కస్టడీ’ సినిమాలో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు వెంకట ప్రభు దర్శకత్వం వహించిన ఈమూవీ ఒకేసారి తెలుగు తమిళ భాషలలో విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉండగా నాగచైతన్య భాగ్యనగరంలో ఒక విలాసవంతమైన ఇంటిని కొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జరుగుతున్న ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే ఈ సంవత్సరంలోనే చైతూ శోభిత ల పెళ్ళి ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేసే ఆస్కారం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: