దసరా నాని మరో లెవల్ అంతే..!

shami
న్యాచురల్ స్టార్ నాని దసరా సినిమా నేడు రిలీజైంది. సినిమా ఇప్పటికే చాలా చోట్ల మార్నింగ్ షోస్ పడగా నాని మాస్ జాతర ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. నాని కెరీర్ లో ఇలాంటి సినిమా రాలేదంటూ ఫ్యాన్స్ అంటున్నారు. అంతేకాదు సినిమాలో ధరణి పాత్రలో నాని విశ్వరూపం చూపించేశాడని చెప్పుకుంటున్నారు. ధరణి పాత్ర నాని చేసిన తీరు అదిరిపోయిందని టాక్. నాని ఈ మేకోవర్ ఇంకా క్యారక్టరైజేషన్ అసలు ఫ్యాన్స్ ఊహించలేదని చెప్పొచ్చు.
దసరా ట్రైలర్ లోనే నాని మాస్ లుక్ అదరగొట్టగా ఇప్పుడు సినిమాలో అది ఓ రేంజ్ లో వర్క్ అవుట్ అయినట్టు తెలుస్తుంది. మ్యుఖ్యంగా నాని లాంటి హీరో ఇలాంటి పాత్రలో చూడటం ఆడియన్స్ కు మంచి ఐ ఫీస్ట్ లా అనిపించింది. కథను, క్యారక్టర్ ని నమ్మి కొత్త దర్శకుడే అయినా నాని దసరాతో పెద్ద సాహసమే చేశాడు. అయితే సినిమా చూసిన తర్వాత దానికి తగిన ప్రతిఫలం దక్కిందని అనిపిస్తుంది. సినిమాలో ధరణి పాత్రలో నాని చూపించిన యాటిట్యూడ్ నెక్స్ట్ లెవ లో ఉందని తెలుస్తుంది.
అంతేకాదు ఈ సినిమా తర్వాత నాని క్రేజ్ దృశ్యాం నెక్స్ట్ లెవల్లో ఉంటాడని చెప్పొచ్చు. దసరా సినిమా కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందని ముందే ఊహించిన నాని సినిమాను అందుకే భారీగా ప్రమోట్ చేశాడు. సినిమాలో ధరణికి ఈక్వల్ గా వెన్నెల పాత్ర అలరించింది. కీర్తి సురేష్ తన నటనతో మెప్పించిందని అంటున్నారు. సపోర్టింగ్ రోల్ చేసిన దీక్షిత్ కూడా తన సత్తా చాటాడు. మొత్తానికి నాని దసరా తన సత్తా చాటే సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిచారు. సినిమాకు అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా తో నాని అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టే లెక్క.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: