శాకుంతలం సినిమాలో.. ముందుగా సమంతను అనుకోలేదు : గుణశేఖర్

praveen
ఇటీవల కాలంలో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే యశోద అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో హిట్టు కొట్టిన సమంత ఇక ఇప్పుడు శాకుంతలం అనే సినిమాలో నటిస్తుంది. విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకర్షించే దర్శకుడు గుణశేఖర్ ఇక ఈ సినిమాను తెరకెక్కించారు అని చెప్పాలి. ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి.

 ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అప్డేట్స్ చూసిన తర్వాత ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి అని చెప్పాలి. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న శాకుంతలం సినిమా ఇక ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో ప్రస్తుతం చిత్రబంధం బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడు గుణశేఖర్ ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ సినిమాను తెరకెక్కించేందుకు మూడేళ్ల సమయం పట్టింది అంటూ చెప్పుకొచ్చాడు.

 అంతేకాదు కాదు మరో ఆసక్తికర విషయాన్ని కూడా చెప్పాడు. ఈ సినిమాలో శకుంతల పాత్ర కోసం సమంతను అనుకోలేదు అంటూ గుణశేఖర్ చెప్పుకొచ్చాడు. అయితే తన కుమార్తెనే సమంత పేరు సూచించిందని గుణశేఖర్ తెలిపాడు
 కథను ఎంచుకున్న తర్వాత పాత్రలపై చాలా రోజులు కసరత్తులు చేసినట్లు చెప్పుకొచ్చాడు. శకుంతలను కాళిదాసు ఎలా వర్ణించారు అనేది నేను చదివాను. అయితే ఆ పాత్రకు ఎవరైతే బాగుంటుందని ఆలోచన చేశాను. అయితే నేను మొదట సమాంతను తీసుకోవాలని అనుకోలేదు. కానీ సమంత అయితేనే ఆ పాత్రకు బాగుంటుందని నా కూతురు చెప్పింది. ఆ సమయంలో మరోసారి రంగస్థలం సినిమా చూసా పాత్రలో సమంత ఒదిగిపోయిన తీరు నాకు నచ్చింది. దీంతో వెంటనే ఆమెను సంప్రదిస్తే ఆమె కూడా కథ విని ఓకే చెప్పింది అంటూ చెప్పుకొచ్చాడు గుణశేఖర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: