వరుస ప్రాజెక్ట్స్ లతో దూసుకుపోతున్న స్టార్ హీరో....!!

murali krishna
ప్రెసెంట్  హీరోలందరూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. కరోనా వల్ల ఒక 2 సంవత్సరాల పాటు అందరూ ఇండ్లలోనే ఉండాల్సి వచ్చింది కాబట్టి హీరోలు కూడా దాని వల్ల ఎక్కువగా సినిమాలు చేయలేకపోయారు.
అందుకే ఇప్పుడు అందరూ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా గడుపుతున్నారు ప్రభాస్ కూడా ప్రస్తుతం వరసగా సినిమాలు చేస్తున్నారు ఇప్పటికే మారుతి తో ఒక సినిమా, ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా, నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ k , సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ సినిమాలు చేస్తూనే ప్రస్తుతం మరో యంగ్ డైరెక్టర్ తో ఒక సినిమా చేయడానికి కమిట్ అయినట్టు గా తెలుస్తుంది.ఆయన ఎవరు అంటే కార్తికేయ 2తో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందిన చందు మొండేటి డైరెక్షన్ లో ప్రభాస్ ఒక సినిమా చేస్తా అని కమిటీ అయ్యాడట రీసెంట్ టైమ్స్ లో చందు మొండేటి ప్రభాస్ ని కలిసి ఒక కథ చెప్పారట అది బాగా నచ్చిన ప్రభాస్ చందు మొండేటి తో ఈ సినిమా చేద్దాం అని హామీ ఇచ్చారట.
అయితే ఇదంతా గమనిస్తున్న జనాలు ఇప్పటికే కమిట్ అయిన సినిమా లు పూర్తి అవ్వడానికి ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది.ఇవి పూర్తి అయిన తరువాత చందు మొండేటి సినిమా ఉంటుందని అంటున్నారు అయితే ప్రస్తుతం చందు మొండేటి కూడా వేరే ఒక ప్రాజెక్ట్ మీద కూర్చున్నట్లు తెలుస్తుంది ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ప్రభాస్ సినిమా మీద ఫోకస్ పెట్టాలని చందు మొండేటి అనుకుంటున్నారట అయితే వీళ్ళ కాంబో లో వచ్చే సినిమా 2025 వరకు సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది.ఇక ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న సినిమా షూటింగ్ లో ఉంది అది ఈ ఇయర్ రిలీజ్ చేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ సినిమా కూడా తొందర్లోనే షూట్ చేసి విడుదల చేయాలని అటు ప్రశాంత్ నీల్, ఇటు ప్రభాస్ ఇద్దరు కూడా అనుకుంటున్నట్లు తెలుస్తుంది.చూడాలి మరి ప్రభాస్ కమిట్ అయిన సినిమాలు ఎప్పటి వరకు పూర్తి చేస్తారో ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: