ట్రైలర్: ఆకట్టుకోలేకపోతున్న పొన్నియన్ సెల్వన్-2 ట్రైలర్..!!
ఇక తాజాగా పొన్నియన్ సెల్వన్ -2 చిత్రం కోసం తమిళ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 28న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ని నిర్వహించారు చిత్ర బృందం. ఇందులో నటించిన స్టార్స్ అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది.పొన్నియన్ సెల్వన్-1 సినిమా ప్రమోషన్స్ కి రజనీకాంత్ కమలహాసన్ వచ్చి మంచి హైట్ చేశారు. అయితే తాజాగా పొన్నియన్ సెల్వన్-2 చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి మాత్రం కమలహాసన్ ముఖ్యఅతిథిగా రావడం జరిగింది.
ఇక ట్రైలర్లు ఎక్కువగా అన్ని యుద్ధాలు ఒకరిపై ఒకరు పన్నాగాలు ఎత్తుకు పై ఎత్తు వంటివి చూపించడం జరుగుతోంది.. చనిపోయాడనుకుంటున్న పొన్నియన్ సెల్వన్ ఎలా బయటికి వచ్చారు.. చోళులు వర్సెస్ పాండ్యుల కథ మొదటి కథకు కొనసాగింపు ఉండేలా ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇక థియేటర్లో ఈ సినిమా సందడి చేస్తుందో లేదో తెలియదు కానీ తెలుగులో అయితే అంతగా మ్యాజిక్ చేయలేకపోతోంది ఇప్పుడు..పొన్నియన్ సెల్వన్ -2 తమిళ్లో హిట్ అయిన తెలుగులో మాత్రం అంతగా ఆకట్టుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది ఇంకో నెల రోజుల్లో ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలుస్తుందని చెప్పవచ్చు.