రామ్ పోతినేని మూవీకి పోటీగా రవితేజ మూవీ..!

Pulgam Srinivas
ఉస్తాద్ రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . రామ్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ మాస్ దర్శకు డు బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు .

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతుంది.

ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ మూవీ ని అక్టోబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇలా రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా విడుదల తేదీన రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" మూవీ ని కూడా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ లపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు మూవీ లలో కూడా భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: